ట్రూటైమ్స్ ఇండియా:అక్టోబర్ 1
దసరా శరన్నవరాత్రులు పర్వదినాన్ని పురస్కరించుకుని బొమ్మనహల్ మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఆయుధ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నబిరసూల్ నేతృత్వంలో సిబ్బంది అంతా కలిసి పోలీస్ స్టేషన్‌లో వినియోగించే ఆయుధాలు, వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు.
పోలీసులు నిత్యం ఉపయోగించే తుపాకులు, ద్విచక్ర వాహనాలు, కారుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగించే లాఠీలకు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాతకు మంగళ హారతితో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ ఎస్‌ఐ నబిరసూల్, సిబ్బంది దుర్గామాతను ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది అయిన కమల్ భాష, ధన సింగ్ నాయక్, జగదీష్, నాగార్జున, రుద్ర, శివ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment