గుత్తి, గుంతకల్, వజ్రకరూర్, విడపనకల్, మరియు ఉరవకొండ మండలాలకు చెందిన క్రీడాకారులు ఈ మూడు క్రీడాంశాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
సభాపతుల ప్రసంగం, బహుమతుల ప్రదానం
పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎస్.కె. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఈశ్వరప్ప , ఎంఈఓ-2 రమాదేవి , వజ్రకరూర్ ఎంఈఓ ఎర్రి స్వామి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ షాషావలి , మరియు డివిజనల్ లెవెల్ కోఆర్డినేటర్ నాగరాజు హాజరయ్యారు.
పోటీలలో ప్రతిభ కనబరిచి, విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ఎంఈఓ ఈశ్వరప్ప చేతుల మీదుగా ట్రోఫీలు మరియు బహుమతులను ప్రదానం చేశారు. ఆయన క్రీడాకారులను అభినందించి, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.
ఈ పోటీల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు కాశీ విశ్వనాథ్ , ఆశ్రఫ్ , శ్రీ మారుతి ప్రసాద్ , రాఘవేంద్ర , ప్రభాకర్ , నాగరాజు రమేష్తో పాటు ఇతర ఉపాధ్యాయులు చురుకుగా పాల్గొన్నారు.

Comments
Post a Comment