నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తుల రద్దీ

Malapati
0

 

నేమకల్లు, అక్టోబర్ 18:

బొమ్మన


హా ల్ మండల పరిధిలోని నేమకల్లు గ్రామంలో కొలువైన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఆలయ ప్రధాన అర్చకులు అనిల్ కుమార్ చార్యులు ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. వేద మంత్రోచ్చారణల మధ్య తెల్లవారుజాము నుంచే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ:

భక్తులు బావిలో నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి స్వామివారి విగ్రహానికి అభిషేకం నిర్వహించారు. అనంతరం:

 పంచామృతాభిషేకం

  కుంకుమార్చన

  ఆకుపూజ

  ప్రత్యేక పుష్పాలంకరణ వంటి విశేష పూజలను నిర్వహించారు.

సందర్శనకు వచ్చిన భక్తులందరికీ అన్నదాన కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!