ఇండియా అక్టోబర్ 18
భారత సైన్యం అమ్ములపొదిలో మరిన్ని బ్రహ్మోస్ క్షిపణులు చేరాయి. యూపీలోని బ్రహ్మోస్ ఏరోస్పేస్ యూనిట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సందర్శించారు. ఇక్కడ తొలి విడత బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేశారు. వీటిని రాజ్‌నాథ్ సింగ్ సైన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. పాక్ దుస్సాహసానికి తెగబడితే ఊహించని ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. యూపీ.. రక్షణ పరిశ్రమ కారిడార్‌కు మైలురాయిగా నిలుస్తుందన్నారు.
