ఎల్లారెడ్డి కోర్టు న్యాయవాదుల విధుల బహిష్కరణ..
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై సోమవారం జరిగిన దాడి యత్నాన్ని నిరసిస్తూ, మంగళవారం ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యానికి భంగం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని, దాడి చేసిన న్యాయవాదిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.
ఈ నిరసనలో శ్రీనివాస్ రావు, సతీష్ కుమార్, పండరి, శ్రీకాంత్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
