అనంతపురం: ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ o8 అనంతపురం జిల్లాలోని శిశు గృహంలో పసికందు ఆకలితో మృతి చెందిన విషాద ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) నాగమణిని అధికారులు సస్పెండ్ చేశారు.
మరికొందరిపై వేటు తప్పదా?
ఈ దారుణ ఘటనపై జిల్లా స్థాయిలో నియమించిన త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పీడీ నాగమణి సస్పెన్షన్‌తో పాటు, ఈ నిర్లక్ష్యానికి కారణమైన మరికొందరు కాంట్రాక్ట్ అధికారులు, ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జిల్లా కలెక్టర్ ఆనంద్ నేడో, రేపో త్రిసభ్య కమిటీ నివేదికపై తుది ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. శిశు గృహం నిర్వహణలో ఉన్న లోపాలు, నిర్లక్ష్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో, మరికొంతమంది సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.సస్పెండ్
అనంతపురం: ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ o8 అనంతపురం జిల్లాలోని శిశు గృహంలో పసికందు ఆకలితో మృతి చెందిన విషాద ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటనలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ (పీడీ) నాగమణిని అధికారులు సస్పెండ్ చేశారు.
మరికొందరిపై వేటు తప్పదా?
ఈ దారుణ ఘటనపై జిల్లా స్థాయిలో నియమించిన త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. పీడీ నాగమణి సస్పెన్షన్‌తో పాటు, ఈ నిర్లక్ష్యానికి కారణమైన మరికొందరు కాంట్రాక్ట్ అధికారులు, ఉద్యోగులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జిల్లా కలెక్టర్ ఆనంద్ నేడో, రేపో త్రిసభ్య కమిటీ నివేదికపై తుది ఆదేశాలు జారీ చేసే అవకాశముంది. శిశు గృహం నిర్వహణలో ఉన్న లోపాలు, నిర్లక్ష్యంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుండటంతో, మరికొంతమంది సిబ్బందిపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.