ధర్మమవరం:ట్రూ టైమ్స్ ఇండియా
ధర్మవరం: పట్టణంలోని పార్థసారథి నగర్‌లో వెలసిన గంగమ్మ తల్లి దేవాలయంలో వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు.
భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు పట్టి, యాటలను నరికి నైవేద్యంగా సమర్పించడం జరిగింది. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కె. మస్తానప్ప ముఖ్యపాత్ర వహించారు. కమిటీ సభ్యులు మాల్యవంతం నారాయణ స్వామి, మేకానిక్ సూరి, పి. శ్రీనివాసులు, సాకే రమేష్, గంగరాజు, పూజారి ఆనంద్, భాస్కర, దుర్గానగర్ రమేష్, చేన్నప్ప, అక్కులప్ప, రాధాక్రిష్ణ, గణేష్, రాప్తాడు రాజు, శంకర్, నాగభూషణ, బాలు, నాగరాజు సహా మిగతా సభ్యులందరూ పాల్గొని ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన రజక సోదర సోదరీమణులందరికీ ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. భక్తులందరి సహకారంతో గంగమ్మ తల్లి బోనాల పండుగ అత్యంత వైభవంగా జరిగింది.

Comments
Post a Comment