- విడపనకల్ వజ్రకరూర్ కూడేరు మండలాలకు విలేకర్లు ఏరి?
- అన్నా వదినలు, పిల్లలపై దాడి ఘటన పై చర్యలేవి?
- వార్తలు రాసిన విలేకరులపై బెదిరింపా?
ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా
పచ్చ పత్రికలో పనిచేస్తున్న ఉరవకొండ ఓ విలేఖరి ఒకరిని ప్రేమించి వంచించిన ఘరానా మోసగాడు. విద్యార్థి మృతికి అతను ప్రధాన కారకుడు.కొన్ని రోజులకు క్రితం రాయం పల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని ప్రేమించాడు. మరో వివాహిత మహిళలతో అక్రమ సంబంధం ఏర్పచుచేసుకొని అమ్మాయిని మోసగించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. ససేమిరా అనటంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఊరు విడిచి అజ్ఞాతంలోకి వెళ్లారు. విలేకరి మీద దాడికి పాల్పటం కూడదని భావించిన ఆ కుటుంబీకులు క్షమా బిక్ష పెట్టారు.
కుక్క తోక వంకర అన్న చందంగా : కుక్క తోక వంకర అన్న చందంగా తిరిగి అదే బుద్ధి అవలంబించారు. ఉరవకొండ వనరుల కేంద్రంలో పనిచేస్తున్న ఓ వివాహిత మహిళపై కన్నేశారు. విధులు సరిగా నిర్వర్తించడం లేదని, బూటకపు వార్తలు రాసి బ్లాక్ మైలింగ్ కు పాల్పడ్డారు. బాధితురాలు భర్తకు ఫిర్యాదు చేయడంతోఆ విలేకరికి గట్టిగా బుద్ధి చెప్పారు. లేనిపక్షంలో దేహశుద్ధి చేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితురాలు సామాజిక వర్గానికి చెందిన ఓ విలేకరి సాయంతో మధ్యవర్తిత్వం చేశారు. సత్ప్రవర్తనతో నడుచుకుంటామని ప్రాధేయపడ్డారు.
ఇది ఇలా ఉండగా ఓ ఉపాధ్యాయుని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంస్థ దృష్టికి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే : పనిచేసే సంస్థ దృష్టికి ఎవరైనా ఫిర్యాదులు చేస్తే విచారణ బాధ్యత స్టాఫ్ రిపోర్టర్ కు అప్పగిస్తారు. సదరు విలేఖరి స్టాఫ్ రిపోర్టర్ కు మంచి దోస్తానా ఉంది. ఒకే కంచం ఒకే మంచం వారిద్దరిది. గతంలో ఉరవకొండ విలేఖరి పర్యవేక్షణలో స్టాఫ్ రిపోర్టర్ శిక్షణ పొందారు. అందుకే ఫిర్యాదులన్నీ స్టాఫ్ రిపోర్టర్ తూచ్ మనిపిస్తున్నారు.
ఇద్దరూ ఇద్దరే: మీది తెనాలే, మాది తెనాలే. ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో ఫిర్యాదులన్నీ బుట్ట దాఖలు అవుతున్నట్లు ఆరోపణలు సర్వత్రావెల్లువెత్తుతున్నాయి.
విలేఖరివి ఒంటె పోకడలు : తన మాటే వేదం తాను రాసిందే నిజమని మనస్తత్వం ఆయనది. విలేఖరివి వింత పోకడలు. తాను రాసిందే నిజమైన వార్త అనే నైజం. అనవసరమైన వార్తలు రాశావంటూ కొద్ది రోజుల క్రితం ట్రాన్స్ జెండర్స్ దాడి చేశారు. తమ గురించి ఎందుకు రాశావని విలేఖరిని వారు నిలదీశారు. దీంతో బెదిరిస్తున్నారంటూ ట్రాన్స్ జెండర్స్ కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. దీంతో మొత్తం ట్రాన్స్ జెండర్స్ కలిసి మా మీద వ్యతిరేక వార్తలు రాసేదే కాక మా పైనే ఫిర్యాదు చేస్తావా అంటూ పోలీస్ స్టేషన్లోనే రౌండ్ అప్ చేశారు. ఎస్ఐ సీఐ ఎదుటే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో పోలీసులు మిన్న కుండిపోయారు.
విలేఖరులను నిలవరించరు : ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు, విడపనకల్లు కూడేరు మండలాలకు ఇప్పటిదాకా విలేకరులు లేకపోవడం కొసమెరుపు. తన మాట వినని వ్యక్తులపై లేనిపోని అభియోగాలు మోపుతూ స్టాఫ్ రిపోర్టర్ దృష్టికి తీసుకెళ్లి
వూస్టింగ్ చేయిస్తున్నారు. పెద్ద పత్రిక అత్యధిక ప్రజాదరణ పొందిన పత్రికలో పనిచేయటానికి మూడు మండలాల్లో ఒక్కరు లేరా రారా అనేది సంస్థ యాజమాన్యం సింహావలోకనం చేసుకోవాలి.
అవినీతి అక్రమాలు, బ్లాక్మెయిలింగ్, దుర్మార్గమైన దాడి, ఆత్మహత్య కారకుడైన విలేకరిపై సంస్థ నీతి నిజాయితీ కలిగిన వ్యక్తులచే సమగ్ర విచారణ జరిపించాలని పాఠకులు కోరుతున్నారు.

Comments
Post a Comment