కర్నూల్ అక్టోబర్ 13:
ఈ నెల 16న కర్నూల్‌లో జరగనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ పర్యవేక్షించారు. "సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్" పేరుతో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభ వేదిక అయిన నన్నూరులోని రాగమయూరి గ్రీన్ హిల్స్‌ను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా, సభకు హాజరయ్యే ప్రజలకు చేయాల్సిన భోజన ఏర్పాట్లపై మంత్రి పయ్యావుల కేశవ్ తన సహచర మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
సభకు భారీగా తరలి వచ్చే ప్రజలకు భోజనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు సమగ్రమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పర్యటన విజయవంతం చేసే దిశగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

Comments
Post a Comment