ఉరవకొండ
ఉరవకొండ/అనంతపురం: పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త, పవన్ రెస్టారెంట్ మరియు కవిత సూపర్ మార్కెట్ స్థాపకులు రాజు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కూరగాయల వ్యాపారిగా జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి రెస్టారెంట్, సూపర్ మార్కెట్ వంటి వ్యాపార సంస్థలను స్థాపించి ఆయన పట్టణంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాలపాటి శ్రీనివాసులు, మధుబాబు, వార్డు సభ్యులు పాటిల్ నిరంజన్ గౌడ్, లెనిన్ బాబు సంయుక్తంగా సంతాప ప్రకటన విడుదల చేశారు.
ఆయన మృతి తీరని లోటని పేర్కొంటూ, దివంగత రాజు ఆత్మకు శాంతి చేకూరాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Comments
Post a Comment