Anantapur:True Times India
అనంతపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహంపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జైభీమ్ రావ్ భారత్ పార్టీ (JBRBP) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడా శ్రవణ్ ఆదేశాల మేరకు అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ వద్ద బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ మాట్లాడుతూ, అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల చర్యను తీవ్రంగా ఖండించారు.
నిందితుల అరెస్టుకు డిమాండ్
నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జైభీమ్ రావ్ భారత్ పార్టీ అనంతపురం అర్బన్ ఇంచార్జ్ నరేష్ కొడవండ్ల మాట్లాడుతూ, దేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం అమానుషమన్నారు. ఈ ఘటన వెనుక ఉన్నవారిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే, రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు చేపడతామని, ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని జిల్లా అధ్యక్షులు రామప్ప నాయక్ హెచ్చరించారు. అంబేద్కర్ ఆశయాలను అవమానించేలా, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన దుండగులను కఠినంగా శిక్షించాలని పార్టీ నేతలు ఈ సందర్భంగా కోరారు.

Comments
Post a Comment