_కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలే తప్ప రైతులకు చేస్తుంది శూన్యం అంటూ వైసీపీ ప్రజాప్రతినిధులు ఎద్దేవా_
విడపనకల్:అక్టోబర్ 23
విడపనకల్ మండల కేంద్రంలోనున్న ప్రజాపరిషత్ కార్యాలయంలో మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కరణం పుష్పావతి భీమరెడ్డి అధ్యక్షతన,ఇన్చార్జ్ ఎంపీడీవో సత్యబాబు ఆధ్వర్యంలో గురువారం సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో రైతులు సమస్యలపై వాడి వేడిగా చర్చ సాగింది.రబీ సీజన్ ఆరంభమైనప్పటికీ సబ్సిడీపై పప్పుశనగ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాలేదంటూ అధికారులను నిలదీసిన ప్రజాప్రతినిధులు.ఈ ప్రక్రియపై ప్రభుత్వం నుంచే ఎటువంటి సమాచారం లేదన్న వ్యవసాయ అధికారి.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతు,ఏవో భాస్కర్,వైస్ ఎంపీపీ మోదుపల్లి సునీత,డిప్యూటీ తాహాసిల్దార్ చంద్రశేఖర్ మరియు వివిధ శాఖ అధికారులు,పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు._


Comments
Post a Comment