విజయవాడ/అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా మంత్రుల బృందం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ, వక్ఫ్ బోర్డు తరపున పలు ముఖ్యమైన అంశాలను ఈ సందర్భంగా మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మంత్రులు, అధికారులు:
విజయవాడ నుండి:
అనగాని సత్యప్రసాద్ గారు (రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి)
కొలుసు పార్థసారథి గారు (రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి)
ఎన్.ఎమ్.డి ఫరూక్ (రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి)
సంబంధిత శాఖల కార్యదర్శులు మరియు ఉన్నతాధికారులు.
అనంతపురం కలెక్టరేట్ నుండి:
పయ్యావుల కేశవ్ (రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా, వక్ఫ్ బోర్డు సమస్యలపై మంత్రులందరూ కూలంకషంగా చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం అవసరమైన చర్యలు, తగు నిర్ణయాలు తీసుకునే దిశగా కార్యాచరణను ప్రారంభించినట్లు సమావేశంలో వెల్లడించారు. త్వరలో ఈ అంశాలపై మరిన్ని స్పష్టమైన ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.


Comments
Post a Comment