-ప్రజా ఉద్యమం’ పోస్టర్లు విడుదల
ఈనెల 28న రాయదుర్గంలో ర్యాలీ
రాయదుర్గం అక్టోబర్ 24 :
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘‘వైఎస్‌ఆర్‌సీపీ ప్రజా ఉద్యమం‘పై రూపొందించిన పోస్టర్‌ను రాయదుర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులతో కలిసి ఆవిష్కరించిన *వైసీపీ రాష్ట్ర జాయింట్ సెకరేట్రి మెట్టు విశ్వనాధ్ రెడ్డి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ విజయవంతంగా కొనసాగుతోంది.
మెట్టు విశ్వనాధ్ రెడ్డి మాట్లాడుతూ
ఈనెల 28వ తేదీన రాయదుర్గం నియోజకవర్గ లో ర్యాలీ చేపడుతున్నాం. ఈ ప్రజా ఉద్యమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, అభిమానులు అనుబంధ విభగాల, అధ్యక్షులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొనాలని కోరుతున్నాం.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చాయి.
16 నెలలుగా కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకొంది
కూటమి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు రాజ్యమేలుతున్నాయి అభిరుద్ది శున్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు నిర్మాణం చేపట్టి 5 అందుబాటులోకి తెచ్చారు. మరో రెండు కళాశాలలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో 10 కళాశాలలను మన అనేవాళ్లకు కట్టబెట్టేందుకు జీవో కూడా ఇచ్చారు.
ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను నిలువు దోపిడీ చేయడం కోసమే పీపీపీ పేరుతో చంద్రబాబు కూటమి సర్కార్ భారీ స్కాంకు తెరలేపారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కళాశాలలు ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజా ఉద్యమం చేస్తున్నాం.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ ఓ యజ్ఞంలా కొనసాగుతోంది. ఇంకా ఉధృతం చేయడంలో భాగంగా అక్టోబర్ 28వ తేదీన అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేస్తామని తెలియజేసారు...
*ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపే వరకు వైయస్‌ఆర్‌సీపీ పోరుబాట ఇలాగే కొనసాగుతుంది. ఇంకా ఉదృతం చేస్తామని కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు*
ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్మన్ ఐదు మండలాల కన్వీనర్లు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండలాల నుండి ఎన్నుకోబడిన అనుబంధ విభగాల అధ్యక్షులు, ఎంపీపీ,సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు, అభిమానులు, వైసీపీ కుటుంబ సభ్యులు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Comments
Post a Comment