"
అనంతపురం జిల్లాలో అక్టోబర్ 12 నుండి 18 వరకు "సేవ్ ది గర్ల్ చైల్డ్" (బాలికలను రక్షించండి) నియమావళిపై PC&PNDT చట్టం కింద అవగాహన కార్యక్రమాల ప్రచారాన్ని నిర్వహించాలని సూచనలు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా, అక్టోబర్ 14, 2025 (అంతర్జాతీయ బాలిక దినోత్సవం) నాడు, వజ్రకరూరు మండలం, చాబాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిప్యూటీ హెల్త్ ఎడ్యేకేషన్ ఆఫీసర్ (Deputy Health Education Officer) శ్రీ వేణుగోపాల్ గమరియు గ్రామ సర్పంచ్ శ్రీ జగదీష్ గారు హాజరయ్యారు. బాలికలకు సాధికారత (Empowerment), రక్షణ, విద్య, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ మరియు ఆరోగ్యం వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు.
గ్రామ సర్పంచ్ శ్రీ మల్లెలు జగదీష్ మాట్లాడుతూ, "సేవ్ ది గర్ల్ చైల్డ్" యొక్క ప్రాముఖ్యత గురించి సమాజంలో అవగాహన పెంచడం చాలా ముఖ్యమన్నారు. బాలికలను రక్షించడం, వారికి సాధికారత కల్పించడం అనే లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం వహించాలని ఆయన కోరారు.
ఆరోగ్య విస్తరణాధికారి శ్రీ విజయ్ కుమార్ గ ఈ సందర్భంగా మాట్లాడుతూ, లింగ వివక్షత కారణంగా సమాజంలో అనేక అసమానతలు ఉన్నాయని, వీటిని తొలగించడానికి బాల్యం నుంచే పిల్లలు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీ రహంతుల్లా గ, ఉపాధ్యాయులు, MLHP పావని, ఏ.ఎన్.ఎం., ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment