37వ వర్ధంతి సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో కార్యక్రమం
ఉరవకొండ
: అక్టోబర్ 12
స్వాతంత్య్ర సమరయోధుడు, గొప్ప పోరాటయోధుడు ఐదుకల్లు సదాశివన్ 37వ వర్ధంతిని పురస్కరించుకుని ఆదివారం ఉరవకొండలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సీపీఐ నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సీపీఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి జె. మల్లికార్జున మాట్లాడుతూ, సదాశివన్ గారు స్వాతంత్య్ర సమరయోధుడిగా, హరిజనోద్యమ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా, మరియు కమ్యూనిస్టుగా సమాజానికి అందించిన సేవలు అనంతమైనవని కొనియాడారు.
జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ఐదుకల్లు సదాశివన్ చేసిన సేవలు చిరస్మరణీయమని మల్లికార్జున పేర్కొన్నారు. ఆయన ఆశయాలను యువ కమ్యూనిస్టులు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పార్టీ నాయకులు సుల్తాన్, గన్నే మల్లేష్, పురిడి తిప్పయ్య సుబ్రహ్మణ్యం, రాజు, మరియు తోపుడు బండ్లు యూనియన్ నాయకులు చక్రధర్ తదితరులు పాల్గొన్నారు.
