(శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ):
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ముఖ్య నాయకుల సమావేశం ఈరోజు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాబోయే సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ రాష్ట్ర మహాసభల ప్రచార కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించారు.
ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి వేమన మాట్లాడుతూ... డిసెంబర్ 6, 7 తేదీలలో కడప నగరంలో జరగనున్న సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ 9వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేసేందుకు చేపట్టవలసిన ప్రచార కార్యక్రమాల గురించి నాయకులకు వివరించారు. ఈ మహాసభల ప్రాధాన్యతను, విద్యార్థి సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో ఏఐఎస్ఏ రాష్ట్ర సహాయ కార్యదర్శి భీమేష్, యూనివర్సిటీ కార్యదర్శి కృష్ణ, ఇతర ముఖ్య నాయకులు యమన, వెంకటేష్, ఆనంద్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మహాసభల ప్రచారంలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచే అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది..

Comments
Post a Comment