విశ్వశాంతి నగర్ లో ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దగ్గుపాటి
అధికారులు కాలనీవాసులతో మాట్లాడిన ఎమ్మెల్యే
వచ్చే వర్షాకాలకి శాశ్వత చూపిస్తామన్న ఎమ్మెల్యే
గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రస్తుతం వర్షాలకు కాలనీల్లోకి నీరు చేరుతోందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శలు చేశారు. రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆయన రుద్రంపేట పంచాయతీలో ముంపుకు గురైన విశ్వశాంతి నగర్ లో పర్యటించారు. అధికారులు స్థానిక టిడిపి నాయకులతో కలసి కాలనీ మొత్తం తిరిగారు. అక్కడ ఎంత మేర నీరు వచ్చింది... ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్నది ఆరా తీశారు. వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు చూపించారు. అలాగే అధికారులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2022 సంవత్సరంలో అనంతపురం నగరంలో భారీ వర్షం వచ్చి చాలా కాలనీలు నీట మునిగాయన్నారు. అప్పట్లో కొందరు వైసీపీ నాయకులు ఆక్రమణల వలన ఇబ్బందులు వచ్చాయన్నారు. వంకల్లో ఎక్కడా పూడిక తీయకపోవడం వలన కాలనీల్లోకి నీరు వచ్చిందన్నారు. ఈ సమస్యలన్నింటిని పరిష్కరిస్తున్నామన్నారు. వంకలకు ప్రొటెక్షన్ వాల్స్ నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని...త్వరలోనే అవి మంజూరవుతాయన్నారు. అకలంగా కురిసిన ఈ వర్షాలకు కాలనీలోకి నీరు వచ్చిందని.. కేవలం 50 కుటుంబాలకు మాత్రమే ఇబ్బంది కలిగిందన్నారు. ప్రస్తుతం సచివాలయాల్లో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే వర్షాకాలానికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు.



Comments
Post a Comment