*మహారాష్ట్ర అక్టోబర్ 24
మహారాష్ట్ర సతారా జిల్లా ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలు సంపద ముండే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నారు. వైద్య పరీక్షల విషయంలో పోలీసులతో వాగ్వాదం జరగడంతో ఆమెపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన వైద్యురాలు, సీనియర్ అధికారిని కలసి విచారణ ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. అన్నట్టుగానే చివరికి గురువారం రాత్రి ఆస్పత్రిలోనే ఆమె సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
