గోరంట్ల అక్టోబర్ 24:
గోరంట్ల పట్టణకేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ఉర్దూ) నందు పదవ తరగతి లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారికీ రాష్ట్ర బీసీ సంక్షేమ & చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ ఆశీస్సులతో గోరంట్ల మైనారిటీ యువ నాయకుడు, సమాజ సేవకుడు ఉమర్ ఖాన్ తన సహృదయం తో జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి లో ఉత్తమ ప్రతిభతో పాస్ అయిన బాలికలకు ప్రోత్సాహం బహుమతులు అందజేశారు. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన ముస్కాన్ కి 5 వేలు, సెకండ్ క్లాస్ లో పాస్ అయిన సానియా కి 3 వేలు, థర్డ్ క్లాస్ లో పాస్ అయిన అయేషా కి 2వేల రూపాయలు, వారిని ప్రోత్సహిస్తూ ఉమర్ ఖాన్ తన చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments
Post a Comment