భారీగా మొక్కలు పంపిణీ,
ఉ
రవకొండ అక్టోబర్ 24:
ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోనివజ్ర కరూర్ మండలం జే. రామ పురం లో రైతులకు 98 ఎకరాల్లో 13,500 మొక్కలు పంపిణీ చేసి వాటి సంరక్షణ భాధ్య తలు అప్పగించారు. ఈ
ఇంటర్నేషనల్ క్లైమేట్ యాక్షన్ డే సందర్భంగా బృహత్ కార్యక్రమం చేపట్టారు.
వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, జె. రామాపురం గ్రామంలో 35మంది రైతులకు సుమారు 98ఎకరాల విస్తీర్ణంలో 13500 మొక్కల పంపిణీ మరియు నాటకం కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీ సతీష్ కుమార్ ,సే ట్రీస్ ప్రోగ్రాం మేనేజర్ డి. పీరవళి సే ట్రీస్ ఫీల్డ్ టీమ్ బాబు నాయక్,N. సుమంత్ మరియు బి. గురుప్రసాద్ మరియు గ్రామ కమిటీ మరియు రైతులు హాజరూ కావడం జరిగినది.
ఈ కార్యక్రమంలో మహాగని, రెడ్ సాండల్‌వుడ్ మరియు టెంకాయ మరియు చినీ మొక్కలు నాటడం జరిగింది.
ఈ ప్లాంటేషన్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ రైతులకు ఆర్థికంగా నిలకడైన ఆదాయం అందించడం లక్ష్యంగా ఉంది.
సే ట్రీస్ మరియు హ్యాండ్స్ సంస్థలు కలిసి రైతులకు నీటి నిర్వహణ, మొక్కల సంరక్షణ, మరియు కార్బన్ ప్రాజెక్ట్ ప్రయోజనాలపై అవగాహన కల్పించాయి.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన రైతులు, కమిటీ సభ్యులు, మరియు స్థానిక అధికారులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

