డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ

Malapati
0

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో య.19.92 సెంట్లు భూమి ఆక్రమించాలని చూసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చర్యలను తక్షణమే నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ

పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించిన మాజీ న్యాయమూర్తి, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

సంవత్సరాల కాలంగా తమ ఆధీనంలో ఉన్న భూమిని శ్రీ సీతారామ స్వామి వారి దేవస్థానం తమ భూమి అంటూ భూములను అమ్మే ప్రయత్నం చేస్తుందని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన గొల్లపల్లి శ్రీనివాసులు తదితర రైతులు.

రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో తమ సాగు బడిలో ఉన్న భూమిని అన్యాయంగా తమ నుంచి లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కోర్టును ఆశ్రయించిన రైతులు.

రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో* అన్యాయంగా రైతుల నుంచి భూమి తీసుకొని వేలం చేయాలని ప్రక్రియ చేస్తున్నారంటూ వాదనలు.

ల్యాండ్ ఎంకరోచ్మెంట్ ట్రిబ్యునల్ లో కేసు ఉన్నప్పటికీ* దాన్ని పక్కనపెట్టి రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో పేద రైతుల బతుకుతెరువైన భూమి తీసుకోవటం న్యాయ సూత్రాలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్

పదుల సంవత్సరాల భూమి తమ ఆధీనంలో ఉండగా ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భూమి వేలం వేయటం న్యాయ సూత్రాలకు వ్యతిరేకమన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు

తక్షణమే బహిరంగ వేలం నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ

ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయవలసిందిగా హైకోర్టు ఆదేశం.

రైతుల స్వాధీనంలో ఉన్న భూమిని ఎండోమెంట్ కమిషనర్ ఎలా స్వాధీనం చేసుకుంటారు అంటూ ప్రశ్నించిన న్యాయస్థానం.


Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!