రజక మహిళ జిల్లెల్ల శ్రీదేవి నియామకం
శ్రీశైలం దేవస్థానం పాలకమండలి చరిత్రలో తొలిసారిగా ఒక రజక మహిళకు సభ్యురాలిగా చోటు దక్కింది. జిల్లెల్ల శ్రీదేవిని పాలకమండలి సభ్యురాలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జిల్లెల్ల శ్రీదేవి మాట్లాడుతూ, తమను వెన్నంటి ప్రోత్సహించిన టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి, మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారికి, యువ నాయకుడు శ్రీ ఎన్ఎండి ఫిరోజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తుందని ఈ నియామకం మరోసారి నిరూపించిందని ఆమె పేర్కొన్నారు. శ్రీశైలం దేవస్థానం పాలకమండలిలో తన వంతు పాత్ర పోషించి, భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తానని జిల్లెల్ల శ్రీదేవి హామీ ఇచ్చారు.


Comments
Post a Comment