
మల్లోజుల లేఖతో మావోయిస్టు ఉద్యమ దిశపై కీలక మలుపు తిరిగినట్టే!
మావోయిస్టు ఉద్యమంలో కీలక నేతగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ సాయుధ పోరాటం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. పార్టీ క్యాడర్‌కు పంపిన లేఖలో ఆయన ఈ విషయాన్ని స్పష్టంగా వెల్లడించారు.
సుదీర్ఘ ఆలోచన, అంతర్గత చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చానని మల్లోజుల పేర్కొన్నారు. “పార్టీ ప్రధాన కార్యదర్శి బతికుండగానే ఆయుధాలు విడిచేందుకు నిర్ణయం తీసుకున్నాం. ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు, సుదీర్ఘ చర్చల ఫలితం” అని లేఖలో పేర్కొన్నారు.
పార్టీ అధికార ప్రతినిధి జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా మల్లోజుల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “పోరాట పద్ధతి మారవచ్చు కానీ ప్రజల పట్ల మా నిబద్ధత మాత్రం తగ్గదు” అని ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం.
ఈ ప్రకటనతో మావోయిస్టు శిబిరంలో కలకలం రేగింది. సాయుధ పోరాటాన్ని వీడి కొత్త మార్గాన్ని ఎంచుకోవాలనే ఆలోచన పార్టీ అంతర్గతంగా వేడెక్కే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.