![]() |
| హర్షం వ్యక్తం చేసిన మాజీ జడ్పీటిసి సభ్యురాలు కలివెల.జ్యోతి... |
సీతారామపురం :ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పిలుపు మేరకు ఉదయగిరిలో జరిగిన “ఆటో డ్రైవర్ల సేవలో" సభ సూపర్ సక్సెస్ కావడం హర్షణీయం అని సీతారామపురం మాజీ జడ్పీటిసి సభ్యురాలు కలివెల జ్యోతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఉదయగిరి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజల నుండి అపూర్వ స్పందన కనిపిస్తూ ఉండటం ఆయన పనితీరుకు నిదర్శనం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ప్రజారంజక పరిపాలనను సాగిస్తున్నదని కలివెల జ్యోతి కితాబునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుచ తప్పకుండా అమలు చేస్తూ ఇది ప్రజల సంక్షేమం కోసం పాటుపడే మంచి ప్రభుత్వం వేయినోళ్ల కీర్తించబడుతున్నదన్నారు. సూపర్ సిక్స్ పధకాలలో ప్రధానంగా మహిళల అభ్యున్నతి, ఆర్ధికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇవ్వడం బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రధమం అని కలివెల జ్యోతి తేల్చి చెప్పారు. మహిళలకు ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేత, తల్లికి వందనం పేరిట ఒక ఇంట్లో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికీ వారి తల్లుల బ్యాంక్ అకౌంట్లలో నగదును జమ చేయడం జరిగిందన్నారు. అదే విధంగా మరో అద్భుతమైన పధకం ఆర్టీసీ బస్సులలో "స్త్రీ శక్తి" పేరుతో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన అంశమని కలివెల జ్యోతి వెల్లడించారు. మహిళల ఉన్నతికి మరింతగా తోడ్పాటును అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి మహిళలు అండగా ఉన్నారనే విషయం తాజాగా వింజమూరు కేంద్రంగా జరిగిన "స్త్రీ శక్తి" విజయోత్సవ సభనిరూపణ చేసిందన్నారు. ప్రజల మనిషిగా కీర్తి ప్రతిష్టలు గడించిన
ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఒక్క పిలుపుతో వేలాదిమంది ఆటో డ్రైవర్లు స్వచ్చందంగా ఉప్పెనలా ఉదయగిరి కి తరలిరావడం ఉదయగిరి రాజకీయ చిత్రపటంలో చెరగని ముద్రను వేసుకున్నదన్నారు. ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రయోజనకరమైన పధకాలను క్షేత్ర స్థాయిలో వారికి అందించడం మరపురాని అంశమన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో నిరంతరం ప్రజల వృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న ప్రజల మనిషి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కు మెట్ట ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని కలివెల జ్యోతి తెలియజేశారు.

Comments
Post a Comment