పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ శ్రీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పక్షాన కలిసి వారికి వారి కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు వేల్పుల రామాంజనేయ ప్రసాద్, రాష్ట్ర సేవా ప్రముఖ్ ఎరుకల రెడ్డి, జిల్లా కోశాధికారి శ్రీనివాసులు, చక్రాయపేట మండల కోశాధికారి మల్లేశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గారితో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలను గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరియు గౌరవ ముఖ్యమంత్రి వారితో కలిసి మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేయడం జరిగింది.తదనంతరం డిఎ మంజూరు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆరియర్స్ ను రిటైర్మెంట్ తర్వాత ఇవ్వడం అనేది ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగిస్తున్నదని గతంలో లాగా ప్రావిడెంట్ ఫండ్ జమ చేసేలా చూడవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే మెమో 57ను అమలు చేయాలని, సిపిఎస్ ఎంప్లాయిస్ కి గతంలో చెల్లించవలసిన డిఏ బకాయిలను నగదు రూపంలో చెల్లించాలని, బదిలీ అయి రిలీవర్ రాక రిలీవ్ కాలేనటువంటి ఉపాధ్యాయులను ప్రతిని ఆమె మార్గాల ద్వారా వారిని రిలీవ్ చేసేటందుకు తగు చర్యలను చేపట్టవలసినదని, ఉమ్మడి సర్వీస్ నిబంధనలు అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించవలసిందిగా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగినది. దానికి వారు సానుకూలంగా స్పందిస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తారని తెలియజేశారు.

Comments
Post a Comment