అనంతపురం అక్టోబర్ 23
మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు, టిడిపి నాయకులు అందుబాటులో ఉండాలి*
*అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ఆదేశం*
అల్పపీడనం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున అనంతపురం నగరంలో అధికారం యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. రెండు మూడు రోజులపాటు వర్షాలు కురుస్తున్నందున ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నగరంలో డ్రైనేజీల్లో పూడిక కనిపించకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు పంచాయతీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరంలో ప్రధానంగా ఉన్న మరువ వంక, నడిమి వంక, పలు కాలనీలలో నీటి ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. ఈ వంకల సమీపంలో ఉన్న కాలనీల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అర్బన్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ అధికారులు, రెవెన్యూ, పోలీసులు అధికారులు అందుబాటులో ఉండాలని ఆయన ఆదేశించారు. డివిజన్లో ప్రజలకు ఏ సమయంలోనైనా స్థానిక టిడిపి నాయకులు అందుబాటులో ఉండి, సహాయం చేయలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా అనంతపురం అర్బన్ కార్యాలయం నెంబర్లను
సంప్రదించాలని సూచించారు.
Comments
Post a Comment