సిపిఎం విజ్ఞప్తి
బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎంపిక కోసం
28,వ తేదీ మంగళవారం నాడు బ్రహ్మంగారిమఠం లో జరుగు అభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగ ప్రజలందరూ సంయమనం పాటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.
సోమవారం నాడు బ్రహ్మంగారిమఠంలోని సుందరయ్య భవన్ నందు సిపిఎం మండల కార్యదర్శి జి.సునీల్ కుమార్ మండల కమిటీ సభ్యులు సాన గోవిందస్వామి,y,అజయ్ కుమార్ లతో కలిసి వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగ పీఠాధిపతి అంశంలో కోర్టులో వాజ్యం నడుస్తున్న నేపథ్యంలో మఠం పీఠాధిపతి ఎవరన్న విషయంలో పీటముడి పడిందని కోర్టు యొక్క సూచనతో పిఠాధిపతి అంశం 28,వ తేదీన చివరి అంకానికి వచ్చిందని వారన్నారు. అందులో భాగంగ రేపు బ్రహ్మంగారిమఠం గుడి ప్రాంగణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రత్యేక అధికారి నేతృత్వంలో పిఠాధిపతులు,
వీరబ్రహ్మంగారి భక్తులు శిష్యులు,తదితరులతో మఠాధిపతి ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమం జరుగుతున్నదని అనంతరం అభిప్రాయాలను ధార్మిక పరిషత్తుకు నివేదించి తదనంతరం పిఠాధిపతి ఎంపిక జరగడంతో మఠాధిపతి అంఖానికి తెరపడనున్నదని వారు తెలిపారు. ఈ సందర్భంగ మండల ప్రజానీకం వీర బ్రహ్మంగారి శిష్యులు భక్తులు బయట ప్రాంతం నుంచి వచ్చేవారు అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో శాంతియుతంగ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఈ సందర్భంగ ఎటువంటి
బెషజాలకు, పరస్పర ఆరోపణలకు వాద ప్రతి వాదనలకు వేళ్ళకుండ అవాంఛనీయ సంఘటనలు జరగనియకుండ మఠం పవిత్రతను,ప్రతిష్టను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని కావున ఈ సందర్భంగ అందరూ సంయమనం పాటించాలని వారు విజ్ఞప్తి చేశారు

Comments
Post a Comment