అనంతపురం ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07:
వైద్యో నారాయణో హరి" అంటే వైద్యుడు నారాయణుడైన భగవంతునితో సమానం అని అర్థం
హాస్పిటల్లోనే ముప్పు ఉందంటే ఎవరిని నమ్మాలి
సోమవారం రోజున కళ్యాణ్ దుర్గం లో ఒక మహిళకు ప్రమాదవశాత్తు ఒక కట్టే పుల్ల చెవికి పొడుచుకింది, వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లాలని బయలుదేరారు
సవేరాకు తీసుకువెళ్లాలని చెప్పడంతో అనంతపురంలోని సవేరా హాస్పిటల్ కు తీసుకువెళ్లడం జరిగింది, చిన్న దెబ్బకు ఐసీయూలో అడ్మిట్ అవ్వాలని మనిషికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వెంటనే 30000 రూపాయలు డబ్బు చెల్లించాలని అక్కడి సిబ్బంది పేర్కొన్నారు....
కుటుంబ సభ్యులు సెకండ్ ఒపీనియన్ కోసం ఇతర హాస్పిటల్స్ కు వెళ్దామని నిర్ణయించుకుని మరొక హాస్పిటల్ కి వెళ్ళగానే అక్కడ ఆ కట్టెపుళ్లను సూక్ష్మంగా తొలగించడం జరిగినది ఇదేమి అంత ప్రమాదం కాదని చెవి పై భాగమున కుచ్చుకుంది కాబట్టి ఎటువంటి సమస్య లేదని అక్కడి వైద్యులు చెప్పడం ద్వారా కుటుంబ సభ్యులు ఊపిరిపించుకున్నారు....
సవేరా లో ప్రాణానికి ముప్పు ఉందని మొదటి డబ్బు చెల్లించాలని చెప్పడం ద్వారా కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోయారు.....

Comments
Post a Comment