ఉరవకొండ ట్రూ టైమ్స్ ఇండియా అక్టోబర్ 07+
ఉరవకొండ: శ్రీ మహర్షి వాల్మీకి జయంతోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు ఘనంగా నివాళులర్పించారు.
మంగళవారం ఉరవకొండ పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ మహర్షి వాల్మీకి చిత్రపటానికి మంత్రి పయ్యావుల కేశవ్ గారు పుష్పామాలాలంకరణ చేసి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన వాల్మీకి సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మంత్రివర్యులతో పాటు రేగాటి నాగరాజు, మోపిడి మాజీ సర్పంచ్ప జంగడి గోవిందు,మోపిడి రాజగోపాల్లు ఆమిద్యాల బావిగడ్డ ఆనంద్,వురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
