తైక్వాండో పోటీలలో సత్తా చాటిన అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినీలు
ఉరవకొండ,మన అక్టోబర్26,
అనంతపురంలో శనివారం జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలలో ఉరవకొండ లో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినీలు పోటీలు నందు పాల్గొని తమ సత్తా చాటి 5 మంది విద్యార్థినీలు గోల్డ్ మెడల్,5 మంది విద్యార్థినీలు సిల్వర్ మెడల్,3 మంది విద్యార్థినీలు బ్రాంజ్ మెడల్స్ సాధించి బహుమతులను గెలుచుకున్నారు.మెడల్స్ సాధించిన విద్యార్థినీలును,పిఈటి మీనా ను ప్రిన్సిపాల్ జ్ఞాన ప్రసూన,వైస్ ప్రిన్సిపాల్ సుమలత ,లైబ్రేరియన్ కుళ్ళాయమ్మ,ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

Comments
Post a Comment