సాలూరు : సాలూరు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు, వీచిన గాలులకు అరటి, మొక్కజొన్న పంటలకు బాగా నష్టం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సబ్బి రామ స్వామి విజ్ఞప్తి చేసారు. సోమవారం ఉదయం విలేఖరులతో మాట్లాడారు. ఈ నెలలో వీచిన గాలులకు మండలంలోని పలు చోట్ల అరటి తోటలు ధ్వంసం అయ్యాయని, మొక్కజొన్న చేలు పూర్తిగా దెబ్బతిన్నాయని. ముఖ్యంగా కందుల పదం, ఎరగడ వలస, మావుడి, బూర్జ, మరిపల్లి, కురుకూటి, తోనాం తదితర గ్రామాల పరిధిలో వందల ఎకరాల్లో అరటి తోటలు విరిగి పడ్డాయన్నారు. మరో 20-30రోజుల్లో కోతకు వచ్చే సమయంలో ధ్వంసం కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. మొక్క జొన్న పంట కూడా వందల ఎకరాల్లో దెబ్బతిందన్నారు. కావున తమ దుస్థితిని గమనించి ఆదుకోవాలన్నారు. అదేవిదంగా గత ప్రభుత్వం హయంలో ఉచిత పంటల భీమా పథకం ఉండేదని, ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ పథకం ఆదుకునేదన్నారు. అయితే దురదృష్టవశాత్తూ నేడు ఆ పథకం లేకపోవడంతో రైతులకు భీమా డబ్బులు వచ్చే అవకాశం లేదన్నారు. ఇది ఇలా ఉండగా పంట నష్టం సర్వే విషయంలో సంబంధిత అధికారులు వేస్తున్న అంచనాలో పక్షపాతం లేకుండా చూడాలన్నారు. పంటలు నష్ట పోయిన ప్రతి రైతు పేరు నమోదు చేసి ప్రభుత్వానికి పంపించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవాలన్నారు.
3/related/default
