ఉరవకొండ: అక్టోబర్ 15
అనంతపురం జిల్లా, ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉరవకొండలోని SK జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం 4:00 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ ఉత్సవానికి భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీమతి సౌభాగ్య దగ్గుపాటి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు కార్యక్రమాల గురించి సభికులకు వివరంగా తెలియజేశారు. జాతీయ భావజాలాన్ని, సేవా స్ఫూర్తిని పెంపొందించడంలో RSS పాత్రను ఆమె కొనియాడారు.
ముఖ్య వక్తగా శ్రీమతి సునీత మరియు శ్రీమతి శ్రీదేవి టీచర్ , RSS వన్నూర్ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి SK కళాశాల విద్యార్థినీ విద్యార్థులు, స్వయం సేవకులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వేడుక హిందూ సంస్కృతి మరియు జాతీయ సమైక్యతను ప్రతిబింబించింది.

Comments
Post a Comment