'
ఉరవకొండ నవంబర్ 7:ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీ లో 150వ వందేమాతరం వార్షికోత్సవ వేడుకలను శుక్రవారం పంచాయతీ పాలక మండలి ఘనంగా జరుపుకొన్నారు.వేడుకల్లో భాగంగా సీనియర్, ఎలక్ట్రీషియన్క్ ఉక్కీసుల గోపాల్ సభ్యులతో సామూహికంగా ఆలపించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూనేటితో
వందేమాతరం' గీతానికి 150 ఏళ్లునిండాయని తెలిపారు.
గీత ప్రాముఖ్య తను వివరించారు.
ఈ అమర గీతాన్ని బెంగాలీ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ రచించారుని వార్డు సభ్యులు నిరంజన్ తెలిపారు.
ఈ గీతాన్ని నవంబర్ 7, 1875 న కూర్చారు. అందుకే, 2025 నవంబర్ 7 నాటికి ఈ గీతానికి సరిగ్గా 150 సంవత్సరాలు నిండాయని వేడుకలు జరుపుకోవడం సంతోషం అన్నారు..
లెనిన్ బాబు మాట్లాడు తూ
స్వాతంత్య్ర పోరాటంలో పాత్ర 'వందేమాతరం' గీతం స్వాతంత్య్ర పోరాటంలో లక్షలాది మంది సమరయోధులకు మనోబలాన్ని, స్ఫూర్తిని ఇచ్చే
ఒక రణన్నినాదంగా మారిందని పేర్కొన్నారు.
వక్తలు గోపాల్, నిరంజన్ గౌడ్, లెనిన్ బాబు లు మాట్లాడు తూ ముఖ్యంగా 1905లో జరిగిన బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం (స్వదేశీ ఉద్యమం) సమయంలో, ఈ గీతం యావత్ దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చి, దేశభక్తికి చిహ్నంగా నిలిచింది. ఈ కాలాన్ని చరిత్రకారులు 'వందేమాతర యుగమైందని వారు అభివర్ణించారు.
ఈ సందర్బంగా వక్తలు ఈ గీతాన్ని మొదటగా 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించారని గుర్తు చేశారు.
జాతీయ గేయంగా గుర్తింపు
జాతీయ గేయం: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత, 1950 జనవరి 24న భారత రాజ్యాంగ సభ ఈ గీతాన్ని 'జనగణమన'తో సమానంగా గౌరవిస్తూ జాతీయ గేయం గా అధికారికంగా స్వీకరించిందని అలాగే.
ప్రపంచ గుర్తింపు: బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన ఒక అంతర్జాతీయ పోల్‌లో, ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో 'వందేమాతరం' రెండవ స్థానం దక్కించుకుందని తెలిపారు.
గీత రచన కు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం ఏడాది పొడవునా స్మారక కార్యక్రమాలు నిర్వహించాలని తలపెట్టిందనారు
అందుకే దేశ వ్యాప్తంగా సామూహిక వందేమాతర గీతం ఆలపించినట్లు వక్తలు కొనియాడారు.
స్మారక చిహ్నాలు: ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక ప్రత్యేక తపాలా బిళ్ళ మరియు నాణెంను కూడా ఆవిష్కరించారుని వారు తెలిపారు.
ఈ కార్యక్రమం లో మిగతా సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments
Post a Comment