నిజాయితీ కి నిలువెత్తు నిదర్శనం ఆటో డ్రైవర్ చంద్రశేఖర్

Malapati
0

తాడిపత్రి బస్టాండ్ వద్ద మరచిన 12 తులాల బంగారం సూట్‌కేస్‌, నిజాయితీతో తిరిగి ఇచ్చిన ఆటోడ్రైవర్ చంద్రశేఖర్.

డీఎస్పీ గారు ఆటో డ్రైవర్ని ప్రశంసించి శాలువా కప్పి అభినందన 

అనంతపురం నగరంలోని తాడిపత్రి బస్టాండ్ పరిసరాల్లో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నంద్యాల జిల్లాకు చెందిన లక్ష్మీ తన భర్త, కుమారుడితో కలిసి అనంతపురం వచ్చింది. నగరంలోని 80 ఫీట్ రోడ్, మారుతి నగర్‌లో జరిగే వివాహానికి వెళ్లేందుకు వారు ఆటోడ్రైవర్ చంద్రశేఖర్‌ ఆటో ఎక్కారు. రాంనగర్ వద్ద దిగిన తర్వాత తొందరలోనే తమ సూట్‌కేస్‌ ఆటోలో మర్చిపోయారు.

రెండు గంటల తర్వాత బ్యాగు కనిపించకపోవడంతో లక్ష్మి తీవ్ర ఆందోళనకు గురై ఎక్కడికక్కడ వెతుకుతుండగా, మరోవైపు ఆటోడ్రైవర్ చంద్రశేఖర్ తన ఆటోలో సూట్‌కేస్ మిగిలిపోయినట్లు గమనించాడు.

ఆయన వెంటనే లక్ష్మి దిగి వెళ్లిన ప్రదేశం వద్దకు తిరిగి వెళ్లి వారికోసం వెతికాడు, కానీ వారెక్కడా కనిపించకపోవడంతో చివరికి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి “ప్యాసింజర్లు మర్చిపోయిన సామాను ఇది” అంటూ సూట్‌కేస్‌ను పోలీసులకు అప్పగించాడు.

వన్ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు గారు సూట్‌కేస్ తెరిచి పరిశీలించగా అందులో సుమారు 12 తులాల బంగారం ఉందని గుర్తించారు. అదే సమయంలో లక్ష్మి కూడా స్టేషన్‌కి చేరుకుని తన సూట్‌కేస్‌ పోయిందని ఫిర్యాదు చేసింది.

డీఎస్పీ  ఆటో డ్రైవర్ని ప్రశంసించి శాలువా కప్పి అభినందించారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!