![]() |
| శ్రీధర్‌రెడ్డిని చాలాకాలం గుర్తుంచుకొంటారు |
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 29 పార్కులు గుర్తించి, కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించి, చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు. మొత్తం విస్తీర్ణం 18 ఎకరాల వరకు వుంటుందని అంచనా. ఇప్పుడు నగరంలో గజం నేల బంగారుతో సమానంగా వుంది కాబట్టి, దాని విలువ ఎంతో వూహించుకోవచ్చు. 400 కోట్ల రూపాయల వరకు వుంటుందని ఒక షుమారు అంచనా. పార్కుల పరిరక్షణ కోసం ప్రహరీ గోడ కట్టించడానికి 7 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందట. కార్పొరేషన్ దాన్ని భరించింది. పార్కు స్థలాలు కాపాడడం అంత సులభం కాదు. ఆయా ప్రాంతాలలోని భుజబలులు మహా ఒత్తిడి తెస్తారు. వీధిలో ఓట్ల లెక్కన బేరం పెడతారు. డబ్బు ఎర వేస్తారు. వీలైతే, భయం కూడా సృష్టిస్తారు. అందుకే ఏ అధికారి కూడా అటువైపు కన్నెత్తి చూడడు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముందు నిలబడడం వల్ల, అధికారులు ధైర్యంగా పార్కులకు విముక్తి కల్పించగలిగారు.
ఈ 29 పార్కులతో సరిపెట్టడం కాకుండా, నగరంలోని మొత్తం పార్కు స్థలాలను గుర్తించి, స్వాధీనం చేసుకోవడం మునిసిపల్ అధికారులు చేయవలసిన పని. ఇళ్లతో క్రిక్కిరిసిన పాత టౌన్‌లో కూడా చాలా పార్కులు వున్నాయి. వాటికి విముక్తి కల్పిస్తే నగరంలో జన జీవనం మెరుగుపడుతుంది. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మంచి పని చేశాడు. ఎమ్మెల్యేగా ఆయన్ను చాలాకాలం గుర్తుపెట్టుకొనే కార్యక్రమం చేపట్టాడు. అందుకాయనకు అభినందనలు.

Comments
Post a Comment