మూడు దశాబ్దాల సేవ
ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి 1995వ సంవత్సరం నుండి నేటి వరకు (దాదాపు 30 సంవత్సరాలుగా) ప్రతి ఏటా గౌరమ్మ దేవాలయ ఉత్సవాల కొరకు విద్యుత్ దీపాలంకరణ మరియు ఇతర సామాగ్రి కోసం ఆర్థిక సహాయం అందజేస్తున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడుతూ, "ఎమ్మెల్సీ శివరామరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా తమ దేవాలయానికి చేస్తున్నటువంటి సేవను మరువలేమ"ని కొనియాడారు. ఈ సంవత్సరం కూడా ఆయన సహకారంతో ఉత్సవాలకు అవసరమయ్యే విద్యుత్ దీపాలంకరణ సామాగ్రిని సమకూర్చుకున్నామని తెలిపారు.
ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఉదారతను గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు , మహేష్, ధనుంజయ, దేవేంద్ర నవీను, సుధాకర్, మహదేవ్, నాగప్ప, మాలింగా, ఉపసర్పంచ్ సుంకన్న, రామకృష్ణ శ్రీనివాసులు, గాలప్ప గారి బసవరాజ్, వన్నారుస్వామి, షబ్బీర్, జంగల్ వన్నూరు స్వామి, రాజు, మంజు, సురేంద్ర, నగేష్, సురేషు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment