బొమ్మనహాల్ మండలం దర్గా హోన్నూర్ గ్రామంలో వెలిసిన హజరత్ సయ్యద్ కాజాసయ్యద్ షో సోఫీ శర్మాస్ హుసేని స్వాములవారి 347 ఉరుసు వేడుకలు ఈనెల ఏడో తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఏడో తేదీన శుక్రవారం గంధం, ఎనిమిదో తేదీ దీపారాధన,9వ తేదీ రెండవ దీపారాధన, పదవ తేదీ దేవుని సవారి, 11వ తేదీన జియరత్ ఉంటుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దర్గాను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించడానికి ఏర్పాటు చేస్తున్నారు. దర్గాను వివిధ రంగులతో సుందరంగా అలంకరిస్తున్నారు. జిల్లా నల్ల మూలల నుంచే కాక కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తుల కోసం త్రాగునీరు ,విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు . ఉరుసు లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఏడు నుంచి దర్గా హోన్నూరు ఉరుసుషరీఫ్ వేడుకలు ప్రారంభం .
November 04, 2025
0
