మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, మైనారిటీ ఆడపిల్లల కోసం ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్యా సదుపాయం కల్పిస్తామని తెలిపారు.
ఇమామ్‌లు, మౌజమ్‌లకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.
అదేవిధంగా, వక్ఫ్ బోర్డు చట్ట సవరణ జరిపినా, ఆస్తుల సంరక్షణను మైనారిటీల ద్వారానే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి, ప్రజలు వీటిని ఆన్‌లైన్‌లో పరిశీలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
