ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాయదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ
రాయదుర్గం: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాయదుర్గం నియోజకవర్గంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నియోజకవర్గ సమన్వయకర్త గౌ. శ్రీ మెట్టు గోవిందరెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ & యువ నాయకుడు శ్రీ మెట్టు విశ్వనాథ్ రెడ్డి గారు తహసీల్దార్ (MRO) గారికి వినతిపత్రం సమర్పించారు.
యువ నాయకుడు వ్యాఖ్యలు: “రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యను పేద విద్యార్థులకు అందుబాటులో ఉంచే బదులు, PPP (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) పేరుతో 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించే నిర్ణయం తీసుకోవడం తీవ్రంగా ఖండనీయమైనది. దేశంలో ఎక్కడా ఇలాంటి పద్ధతి అమలు చేయబడడం లేదు. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రజా వ్యతిరేకతతో ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాయి,” అన్నారు.
“ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజీ స్థాపన వల్ల మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు, సూపర్ స్పెషాలిటీ నిపుణులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులోకి వస్తారు. ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.1000 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు వ్యయం చేస్తే కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలోనే పూర్తి చేయవచ్చు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తన ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది,” అని పేర్కొన్నారు.
పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పర్యవేక్షకులు, మున్సిపల్ చైర్మన్, వార్డ్ కౌన్సిలర్లు, మండల కన్వీనర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మైనార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment