17 మెడికల్ కళాశాలలు 66 సంవత్సరాలు లీజుకి ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంలో ఉన్న17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుకు జాతీయ వైద్య మండలి అనుమతితో నిధులు సమకూర్చింది,ఈ కళాశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థుల వైద్య విద్యను దగ్గర చేస్తున్నామని చెప్పి చెప్పి ఈరోజు ప్రభుత్వం మారగానే వైద్య విద్యను దూరం చేసే విధంగా107,108,590 జీవోను తీసుకొచ్చాయని, మా ప్రభుత్వం వైద్య విద్యార్థులకు అండగా నిలుస్తుందని లోకేష్ బాబు తన యువగలం పాదయాత్రలో వైద్య విద్యార్థులందరికీ సమాన విద్యను అందిస్తామని ఉచిత విద్యను అందిస్తామని ప్రతి విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే గత ప్రభుత్వం తీసుకొచ్చిన 17 వైద్య కళాశాలలకు సంబంధించి 1800 మెడికల్ సీట్లు రద్దు చేయమని కూటమి ప్రభుత్వం జాతీయ మెడికల్ కౌన్సిల్ లకు లేఖ రాయడం చాలా దుర్మార్గం 80 శాతం నిర్మాణం పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించుటకు నాలుగు కళాశా లలు సిద్ధంగా ఉన్నాయి ఆ కళాశాలలను 66 సంవత్సరాలు లీజుకు ఇచ్చే విధంగా PPP విధానాన్ని తీసుకువచ్చి వైద్య విద్యను కూటమి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పూర్తిగా దూరం చేయడమే అవుతుంది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి వెంటనే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి 107 108 జీవోలను రద్దు చేయాలి కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాన్ని రద్దు చేసి 17 వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పిడిఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని అని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పిడిఎస్యు నాయకులు హేమంత్, సతీష్, రాహులు, ఉదయ్ బాబు, ఉదయ్ కిరణ్, ప్రసాద్, బాలు ఇతర నాయకులు పాల్గొనడం జరిగింది.

Comments
Post a Comment