నేడే 9న తిరుమలలో కార్తీక వన భోజనం

Malapati
0

 


తిరుమల,: వన భోజన కార్యక్రమం నవంబరు 9వ తేది తిరుమలలోని గోగర్భం సమీపంలో గల పార్వేటమండపంలో జరుగనుంది. పవిత్రమైన కార్తీకమాసంలో వనభోజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

ఇందులో భాగంగా ఉదయం 8.30 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు చిన్న గజవాహనంపై, ఉభయనాంచారులు పల్లకిపై ఆలయంనుంచి బయలుదేరి ఊరేగింపుగా పార్వేటమండపానికి వేంచేపు చేస్తారు. ఉదయం 11 నుండి 12 గంటల నడుమ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహిసారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అటు పిమ్మట మధ్యాహ్నం 1 నుండి 2 గంటల నడుమ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తారు.

ఈ ఉత్సవం కారణంగా శ్రీవారి అలయంలో నిర్వహించు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!