దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)
దర్గా వన్నూరు, గోవిందవాడ, పాల్తూరు, ఉండబండ మీదుగా విద్యార్థులకు ఉరవకొండ కు బడి బసు ఏర్పాటు చేయాలి:(ఏ. ఐ. ఎస్. ఏ)ఉరవకొండ ఆర్. టీ. సి డిపో మేనేజర్ గారికి మంగళవారం అల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏ. ఐ. ఎస్. ఏ) ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా ఉరవకొండ మండల అధ్యక్షులు మంజునాధ్ నాయక్ మాట్లాడుతూ.... దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి విద్యార్థులు ఉరవకొండ పట్టణం కు వచ్చి విద్యను అభసిస్తున్నారు. కావున వారికీ సరైన బసు సౌకర్యం లేదు బడి బసు కూడా లేదు విద్యార్థులు రోజు ప్యాసింజర్ బాసులో చాలా ఇబంధులకు గురి అవుతూ వారు రోజు ప్రయాణం చేస్తున్నారు అంతే కాకా వారికీ సరైన సమయం లో బస్సు లేక ఉన్న అది ఫుల్ అవ్వడం డోర్ లో వరకు నిలబడడం కొంత మంది విద్యార్థులకు బస్సు లో సీట్లు దొరకక వారు కళాశాలలకు, పాఠశాలలకు వారు సరైన సమయం వెళ్లలేక విద్యార్థులు ఇబంధులు పడుతున్నారు.కావున వీరి పై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థులకు దర్గా వన్నూరు,గోవిందా వాడ, పాల్తూరు, ఉండబండ గ్రామల నుండి ప్రత్యేక బడి బస్సు ఏర్పాటు చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ. ఐ. ఎస్. ఏ నాయకులు సుధాకర్, లాలు, అమరేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment