ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయంలో వి'చిత్ర' దృశ్యం:
ఉరవకొండ :రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చిత్రపటాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం బేఖాతరు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి చిత్రపటాలు లేకపోగా, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటాన్ని ఒక కార్యకర్త చొరవతో కార్యాలయంలో ఏర్పాటు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.
అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు
పరిస్థితి దర్పణం: తహసీల్దార్ కార్యాలయం గోడపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ చిత్రపటం దర్శనమిచ్చింది. అయితే, ఈ చిత్రాన్ని అధికారులు ఏర్పాటు చేయలేదని, ఒక కార్యకర్త స్వయంగా తెచ్చి వితరణ చేయడంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి మరియు ఉపముఖ్యమంత్రి చిత్రపటాలు పూర్తిగా లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
పౌరులు మరియు పార్టీ శ్రేణులు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "ప్రభుత్వం మారినా రెవెన్యూ అధికారుల్లో మార్పు లేదు. 'అవును మేమింతే, మేము మారం అంతే' అనే చందంగా వారి తీరు మారింది," అని వారు విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల బేఖాతరు:
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరియు స్థానిక మంత్రుల ఫొటోలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ ఆదేశాలను ఉరవకొండ రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, తమ ఇష్టానుసారంగా వ్యవహరించడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి.
పార్టీ శ్రేణుల డిమాండ్ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ, అధికారిక చిత్రపటాలను ఏర్పాటు చేయని అధికారులపై ప్రభుత్వం వెంటనే శాఖా పరమైన చర్యలు చేపట్టాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. అధికారుల ఈ ధోరణి అధికార పార్టీకి చెడ్డపేరు తీసుకురావడంతో పాటు ప్రభుత్వ పాలనా సామర్థ్యాన్ని ప్రశ్నించేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు
Comments
Post a Comment