తిరుపతి
తిరుపతి: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ (SIT) విచారణను మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో మరో 11 మందిని నిందితులుగా చేరుస్తూ సిట్ కోర్టులో మెమో దాఖలు చేసింది.
నిందితుల్లో ఏడుగురు టీటీడీ ఉద్యోగులే: కొత్తగా చేర్చిన 11 మంది నిందితుల్లో ఏడుగురు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులే కావడం గమనార్హం.
కొనుగోలు విభాగంపై గురి: 2019 నుంచి 2024 మధ్య టీటీడీ కొనుగోలు (Purchase) విభాగంలో పనిచేసిన ఉన్నతాధికారులపై, కింది స్థాయి సిబ్బందిపై కేసులు నమోదు చేశారు.
ఎవరెవరిపై కేసు నమోదు:
జీఎంలుగా పనిచేసిన జగదీశ్వర్‌రెడ్డి, మురళీకృష్ణలపై కేసు.
వీరితో పాటు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లపై కూడా కేసు నమోదైంది.
ఎస్వీ గోశాల పూర్వ డైరెక్టర్ హరినాథ్‌రెడ్డిపైనా సిట్ కేసు నమోదు చేసింది.
కల్తీ నెయ్యి సరఫరాపై టీటీడీలో అంతర్గతంగా జరిగిన అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనలపై సిట్ లోతుగా దర్యాప్తు చేస్తోంది. మరికొందరు అధికారులకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది..

Comments
Post a Comment