బిక్షాటనా నిషేధ చట్టం- 2025 ఎవరికోసం?భిక్షాటనకు నిర్వచనం ఏమిటి?
ఒకప్పుడు భిక్షాటనకు నిర్వచనం ఆకలికి అడుక్కోవడం.నేడది ఒక స్టేటస్,పోరాట రూపం.
మరి నేడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిక్షాటన నిషేధ చట్టం- 2025 ఆకలి కోసం చేసే భిక్షాటనను నిషేధించడమా? లేక వ్యక్తిగత స్టేటస్,లేదా పోరాటం కోసం చేసే భిక్షాటనను నిషేధించడమా? కేవలం ఆకలి కోసం చేసే పేదల బిక్షాటనను నిషేధించడమే అయితే ఉపయోగం లేదు. బిక్షాటన ఏ రూపంలో ఉన్నా,ఎవరు చేసినా నిషేధించబడాలి,అప్పుడే ఈ చట్టానికి అర్థం,పరమార్థం. లేకుంటే రాజకీయపరమైన నిషేధమే అవుతుంది.
రాష్ట్రంలో భిక్షాటనను నిషేధిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది,దీంతో బిక్షాటన నివారణ లేక సవరణ చట్టం- 2025 అమలులోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం భిక్షాటన చేస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారట, యాచకులకు ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మాత్రమే సహాయం చేయాలట,ఈ చట్టం ఉద్దేశం బిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత బిక్షాటనను నిర్మూలిస్తుందట,అదే నిజమైతే మన రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేసినది ఏమిటి?అది ఈ చట్టం కిందికి వస్తుందా,లేదా?సడలింపులు ఉన్నాయా? రాజకీయ పార్టీలు దాతల నుంచి వసూలు చేస్తున్నదానిని ఏమంటారు? అధికారంలోకి రావడానికి ప్రజలు అడగకుండానే ఎన్నికలలో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే ప్రజలను బిచ్చగాళ్లగా మార్చడానికి ఇస్తున్న కొన్ని పథకాలు,వాటికోసం ఐఎంఎఫ్,వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలతో తెస్తున్నఅప్పులు
చట్టం కిందికి వస్తాయా రావా? ఈ చట్టం కిందికి చేరిస్తే గాని ప్రభుత్వాలు అప్పులు తేవడం
మానేసి,మానవవనరులను సద్వినియోగం చేసుకొని సంపద సృష్టించడానికి పూనుకోరు. అలా చేసినప్పుడు మాత్రమే బిక్షాటన నివారణ చట్టం-2025కు విలువ ఉంటుంది.అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది, సంపద సమానంగా పంచబడుతుంది.


Comments
Post a Comment