సందర్భంగా సిపిఐ ఏఐటియుసి నాయకులు మాట్లాడుతూ భాస్కరు మృతి చెందడం చాలా బాధాకరమని గత 30 సంవత్సరాల నుండి హమాలీ యూనియన్ లీడర్ గా అమాలి కార్మిక సమస్యల పట్ల ఎప్పటికప్పుడు కూలి రేట్లు పెంచడంలో కానీ అమాలి సమస్యల పరిష్కారంలో ముందు ఉండి కార్మికుల కు న్యాయం చేస్తూ మరోపక్క యాజమాన్యంతో సమన్వయంతో సమస్యను పరిష్కరించడంలో ఎంతో అనుభవం ఉండి పరిష్కరించడంతోపాటు ఏఐటియుసి ఏ కార్యక్రమాలు పిలుపు ఇచ్చిన నిబద్ధతతో కార్మిక పోరాటాల్లో పాల్గొంటూ అందర్నీ కలుపుకొని మంచి మనసున్న వాడిగా డోన్ పట్టణంలో అమాలి కార్మిక సంఘం మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా కార్మిక మనసుల్లో మన్ననలు పొందారు.
కార్మిక ఏఐటియుసి కార్యక్రమాలే కాక సిపిఐ పార్టీ చేసే పోరాటంలో మహాసభల్లో కార్మికుల సమీకరించి అత్యంత ఉత్సాహంతో ఎర్రజెండా అంటే ఇష్టంతో కదము తొక్కిన కార్మిక నాయకుడిగా రాణించాడు కార్మిక సమస్యలతో పాటు సామాజిక ఉద్యమాల్లో ప్రధానంగా రాష్ట్ర విభజన తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామకృష్ణ గారు చేపట్టిన సామాజిక హక్కుల వేదిక బస్సు జాత డోన్ కు వచ్చిన సందర్భంగా డోన్ పట్టణం కొత్తపేట దళిత కాలనీలో బస్సు యాత్రకు స్వాగతం పలికి సామూహిక సహపంక్తి భోజనం ఏర్పాటు చేసి వెనకబడ్డ అనగారిన వర్గాలకు సిపిఐ ఎర్రజెండా మాత్రమే అండ అని ప్రజల్లోకి తీసుకెళ్లే ఆయా దళితులకు సిపిఐ పార్టీని దగ్గరకు చేర్చే కార్యక్రమంలో పూర్తి బాధ్యత తీసుకొని కార్యక్రమాన్ని నిర్వహించాడు.ఇలా అనేక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన అమాలి యూనియన్ ప్రెసిడెంట్ భాస్కరు మరణం సీపీఐ అలాగే ఏఐటీయూసీకి ప్రధానంగా అమాలి కార్మికులకు తీరని లోటని నాయకులు బాధని వ్యక్తం చేస్తూ భాస్కర్ కుటుంబానికి ఏఐటియుసి సిపిఐ అండగా ఉంటుందని తెలిపారు.
అంతిమయాత్రలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుంకయ్య,ఏఐటీయూసీ డోన్ కార్యదర్శి అబ్బాస్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి పుల్లయ్య,హమాలి యూనియన్ నాయకులు సురేష్,మధు,కృష్ణ,సుంకన్న,చంద్ర,అయ్యన్న,రాముడు ఏఐటీయూసీ అనుబంధ అనేకమంది కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

