మిస్సింగ్ కేసులో మైనర్ బాలికను కుటుంబానికి అప్పగించిన అనంతపురం త్రీటౌన్ పోలీసులు
శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక కనిపించకుండా పోయిందని కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ నేపథ్యంలో, అనంతపురం ఆర్టీసీ బస్టాండులో తిరుగుతున్న ఒక బాలికను గమనించిన త్రీటౌన్ పోలీసులు ఆమె వివరాలను ఆరా తీశారు. విచారణలో ఆమె గాండ్లపెంట మండలం నుంచి మిస్సింగ్ అయిన మైనర్ బాలిక అని నిర్ధారించారు.
తదనంతరం, పోలీసులు ఆమెను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించి అవసరమైన చర్యలు పూర్తి చేశారు.
Comments
Post a Comment