సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో రికార్డుల మాయం?

Malapati
0

 

విచారణ స్టేట్‌మెంట్ కనిపించడం లేదని సమాధానం

ఆర్టీఐ ద్వారా అడిగితే అంతుచిక్కని వ్యవహారం

అధికారుల తీరుపై బాధితురాలు కోమటిరెడ్డి కోటేశ్వరి ఆవేదన

ఎంరో, వీఆర్వోలపై కుట్ర ఆరోపణలు.. ఉన్నతాధికారులు విచారణ జరపాలని విజ్ఞప్తి

(



సింగరాయకొండ - ప్రతినిధి):

సామాన్యులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లోనే కీలక పత్రాలు మాయమవుతున్నాయా? విచారణలో వాస్తవాలు వెలుగుచూసినా, ఆ పత్రాలను ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నారా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు బాధితురాలు కోమటిరెడ్డి కోటేశ్వరి (స్వాతి). సింగరాయకొండ తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ వ్యవహారంపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

అసలేం జరిగిందంటే..

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాయకొండ పరిధిలోని సర్వే నెంబర్ 338/3 లోని 14 సెంట్ల భూమికి సంబంధించి గతంలో వివాదం నెలకొంది. దీనిపై 03/07/2023 నాడు అప్పటి ఎమ్మార్వో ఉష గారి సమక్షంలో విచారణ జరిగింది. ఈ విచారణకు కోమటిరెడ్డి కోటేశ్వరి మరియు ప్రతివాది మన్నం రంగారావు హాజరయ్యారు.

ఆ రోజు జరిగిన విచారణలో తమ వాంగ్మూలాలను (Statements) రికార్డు చేశారని, ఆ భూమి కోటేశ్వరి వాళ్ళ నాన్నగారిదే అని స్పష్టమైందని, ఇదే విషయాన్ని వీఆర్వో విజయ ఆ స్టేట్‌మెంట్ పేపర్‌లో స్పష్టంగా రాశారని బాధితురాలు తెలిపారు.

ఆర్టీఐ దరఖాస్తుతో బయటపడ్డ నిజం:

ఆనాటి విచారణ ప్రతులను (Statements) ఇవ్వాలని కోటేశ్వరి సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేయగా, కార్యాలయ సిబ్బంది నుండి విస్మయకరమైన సమాధానం వచ్చింది. "ఆ విచారణకు సంబంధించిన స్టేట్‌మెంట్ పత్రాలు కార్యాలయంలో కనిపించడం లేదు" అని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

కుట్ర కోణం ఉందంటున్న బాధితురాలు:

కీలకమైన భూవివాద పత్రం ప్రభుత్వ ఆఫీసులో ఎలా మాయమవుతుందని కోటేశ్వరి ప్రశ్నిస్తున్నారు. మన్నం రంగారావు, చొప్పత చంద్రశేఖర్‌లతో కుమ్మక్కై.. ఎమ్మార్వో ఉష, వీఆర్వో విజయ కావాలనే ఆ పత్రాన్ని మాయం చేశారని ఆమె తీవ్రంగా ఆరోపించారు. తమకు అనుకూలంగా వచ్చిన విచారణ నివేదికను దాచిపెట్టి, తమకు అన్యాయం చేసేందుకే ఇలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

న్యాయం కోసం విజ్ఞప్తి:

తన తండ్రికి దక్కాల్సిన భూమిని దక్కకుండా చేసేందుకు జరుగుతున్న ఈ కుట్రపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఆమె కోరారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి, ప్రభుత్వ రికార్డులను మాయం చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోమటిరెడ్డి కోటేశ్వరి (స్వాతి) డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఆమె మీడియాకు విడుదల చేశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!