తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర్ ప్రసాద్ గారు నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో అనంతపురం నగరం, ఆదర్శనగర్ లో బెస్త సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గంగపుత్ర కమ్యూనిటీ హాలు,మరియు గంగమ్మ& పోలేరమ్మ దేవాలయాల సముదాయానికి ప్రహరీ గోడ నిర్మాణం కోసం ఎంపీ నిధులు ఇప్పించడం కోసం ఎంపీ గారికి సిఫార్సు చేయాలని,అలాగే వేదాలకు మూలపురుషుడైన గంగపుత్రుడు వేదవ్యాస మహర్షి విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వెంటనే ఎంపీ నిధుల కోసం ఎంపీ గారికి లెటర్ పంపిస్తున్నట్లు,అలాగే అనంతపురం నగరంలోని నడిమి వంక సమీపానగల గంగమ్మ గుడి దగ్గర వేద వ్యాసం మహర్షి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ తో అనుమతి ఇప్పిస్తానని చెప్పడం జరిగింది.
వెంటనే బెస్త సంఘం నాయకులు సదర స్థలాన్ని పరిశీలించి ఇంజనీర్ తో అంచనాలు తయారు చేయించి,భూమి పూజ చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బెస్త సేవా సంఘం జిల్లా అధ్యక్షులు కేవీ రమణ,ఉపాధ్యక్షులు గంగప్ప,వర్కింగ్ ప్రెసిడెంట్ హరినాథ్,నగర ఉపాధ్యక్షుడు చేపల హరి,కార్యదర్శి వెంకీ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Comments
Post a Comment